14, జూన్ 2013, శుక్రవారం

పాలకోవా(పేడా)

కావలసినవి:

కండెన్సడ్ మిల్క్ - 1 టిన్ను
పాలపొడి - 1.5 కప్పు
వెన్న - 8 స్పూనులు
ఏలకులు - 4( విప్పదీసి గింజలు దంచాలి)
అలంకరణకి - బాదం పప్పులు/పిస్తా పప్పులు/జీడిపప్పు


తయారుచేసే విధానం:
1) ఒక మందపాటి గిన్నె/మూకుడులో వెన్న వేడి చేయాలి.

2) కరిగిన వెన్నలో పాలపొడి, కండెన్సడ్ మిల్క్ వేసి తక్కువ మంట మీద  అడుగు అంటకుండా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి.

3) దగ్గరపడిన దానిలో ఏలకుల పొడి వేసి కలిపి స్టవ్ మీదనుంచి దించి కొంచెం చల్లారనివ్వాలి.4) అరచేతికి నెయ్యి రాసుకుని, ఆ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని పైన అలంకరించుకోవాలి.

రుచికరమైన దూధ్ పేడా/ పాలకోవా సిద్ధం.

2 వ్యాఖ్యలు: