14, జూన్ 2013, శుక్రవారం

పాలకోవా(పేడా)

కావలసినవి:

కండెన్సడ్ మిల్క్ - 1 టిన్ను
పాలపొడి - 1.5 కప్పు
వెన్న - 8 స్పూనులు
ఏలకులు - 4( విప్పదీసి గింజలు దంచాలి)
అలంకరణకి - బాదం పప్పులు/పిస్తా పప్పులు/జీడిపప్పు


తయారుచేసే విధానం:
1) ఒక మందపాటి గిన్నె/మూకుడులో వెన్న వేడి చేయాలి.

2) కరిగిన వెన్నలో పాలపొడి, కండెన్సడ్ మిల్క్ వేసి తక్కువ మంట మీద  అడుగు అంటకుండా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి.

3) దగ్గరపడిన దానిలో ఏలకుల పొడి వేసి కలిపి స్టవ్ మీదనుంచి దించి కొంచెం చల్లారనివ్వాలి.4) అరచేతికి నెయ్యి రాసుకుని, ఆ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని పైన అలంకరించుకోవాలి.

రుచికరమైన దూధ్ పేడా/ పాలకోవా సిద్ధం.

24, ఏప్రిల్ 2013, బుధవారం

సీమ వంకాయ పచ్చడిసీమ వంకాయ/బెంగలూరు వంకాయ (రుచిలో ఆనపకాయకి దగ్గరగా ఉంటుంది).

కావలసినవి:

తరిగిన సీమ వంకాయ ముక్కలు - 2 కప్పులు
(సీమ వంకాయని మధ్యగా కోసి, గింజ తీసి, చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలి)
శనగపప్పు - 1.5 స్పూనులు
మినపప్పు - 1.5 స్పూనులు
జీలకర్ర - 1 స్పూను
ఆవాలు - 1 స్పూను
ఎండు మిరపకాయలు - 5
చింతపండు - చిన్న ఉసిరికాయ పరిమాణం
ఉప్పు - తగినంత
బెల్లం పొడి - చిటికెడు
 నూనె - 4 స్పూనులు

పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర తరుగు - 1 స్పూను 

తయారుచేసే విధానం:

1) ఒక మూకుడులో 2 స్పూనుల నూనెవేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
2) అదే మూకుడులో 1 స్పూను నూనెవేసి తరిగిన సీమ వంకాయ ముక్కలు వేసి, ఉప్పు, పసుపు వేసి మగ్గించాలి.

3) వేయించిన  తాలింపుని రుబ్బి, అది కొంచం నలిగాక, చల్లరిన ముక్కలు, చింతపండు, బెల్లం వేసి రుబ్బుకోవాలి.
4) ఒక చిన్న గరిటలో 1 స్పూను నూనె వేడి చేసి, ఆవాలు, ఇంగువ వేయించి పచ్చడిలో కలిపి కొత్తిమీర తరుగుతో అలంకరించుకోవాలి.


రుచికరమైన సీమ వంకాయ పచ్చడి మీ కోసం సిద్ధం.

for English recipe click here.

22, ఏప్రిల్ 2013, సోమవారం

బొబ్బట్టు

కావలసినవి:

పూర్ణం కోసం -

పచ్చి శనగపప్పు - 1 కప్పు
బెల్లం (కోరినది) - 1 కప్పు
నీరు - ఉడికించడానికి తగినంత ( 2 కప్పులు)


పై పొర కోసం -
మైదాపిండి - 2 కప్పులు
ఉప్పు - చిటికెడు
నీరు - కలపడానికి సరిపడ
నూనె - 2 స్పూనులునెయ్యి - కాల్చడానికి సరిపడ

తయారుచేసే విధానం:

 పూర్ణం తయారీ:

1) శనగపప్పు సరిపడా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి (ఉడికించినా బద్దబద్దగా ఉండేలా చూడాలి).
2) ఉడికించిన శనపప్పులో నీళ్ళు వడకొట్టాలి, ఒక చిల్లులగిన్నెలో వేసి 10 నిమిషాలు ఉంచాలి.

3) ఈ శనగపప్పుని గట్టిగా నీళ్ళు తక్కువ పోసి రుబ్బుకోవాలి.4) దానిలో కోరిన బెల్లం కలిపి ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకోవాలి.


ఒకవేళ ఈ మిశ్రమం ఉండ అవకుండా గట్టిగా ఉన్నట్టయితే కొంచంసేపు ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిపడుతుంది.  దానిమీద ఒక తడిగుడ్డ కప్పి ఉంచాలి.

పై పొర తయారీ:

 మైదాపిండిలో కొంచం కొంచం నీళ్ళు పోసుకుంటూ గట్టిగా తడుపుకోవాలి. దానిలో నూనెపోసుకుని బాగా మర్దించాలి. బొబ్బట్టు తయారీ: 
1) మైదాపిండిని నూనెతో వత్తుకోవాలి.


2) దానిమీద పూర్ణం ఉండచేసుకుని పెట్టుకోవాలి.


3)  దానిని జాగ్రత్తగా అన్నివైపుల నుంచి మూసెయ్యాలి.4) దానిని మరల జాగ్రత్తగా వత్తుకోవాలి.


5)దానిని పెనం మీద నెయ్యి వేసి ఎర్రగా కాల్చుకోవాలి.రుచికరమైన బొబ్బట్టు మీకోసం సిద్ధం.


for English recipe click here

20, ఏప్రిల్ 2013, శనివారం

కోసంబరి ( వడపప్పు)

కావలసినవి:

 పెసరపప్పు - 1 కప్పు
కారెట్ తురుము - 1 స్పూను
కొబ్బరి తురుము - 1 స్పూను
కీరా తురుము - 1 స్పూను
నిమ్మరసం - 2 స్పూనులు
పచ్చిమిరపకాయ - 1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)

 తయారుచేసే విధానం:
 1) పెసరపప్పు 1 గంట నానబెట్టుకొని నీరు వడగొట్టాలి.
2) దానిలో కారెట్ తురుము, కొబ్బరి తురుము, కీరా తురుము, తరిగిన పచ్చిమిరపకాయలు,నిమ్మరసం, కొద్దిగా ఉప్పువేసి కలపాలి.

 కమ్మని వడపప్పు మీకోసం సిద్ధం


 పానకం(http://curryleafs.blogspot.com/2013/04/blog-post.html) తో కలిపి సేవించండి.

for English recipe click here

పానకంకావలసినవి:
కోరిన బెల్లం - 1/2 కప్పు
మంచినీరు - 2 కప్పులు
మిరియం పొడి - 1 స్పూను
ఏలకులు - 3తయారుచేసే విధానం:
1) బెల్లం నీళ్ళలో బాగా కరగబెట్టాలి
2) దానిలో దంచిన ఏలకులు, మిరియం పొడి వేసి కలపాలి
ఒక వేళ తీపి తక్కువతినే అలవాటు ఉన్నట్లయితే కొంచం నిమ్మరసం, ఒక స్పూను కోరిన అల్లం కలిపితే మంచి రుచి వస్తుంది.


 వడపప్పు(http://curryleafs.blogspot.com/2013/04/blog-post_20.html)తో కలిపి సేవించండి.

for English recipe click here

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

నిమ్మకాయ పులిహోర

కావలసినవి:

బియ్యం - 1 రైస్ కుక్కర్ కప్పు
నిమ్మకాయ - 1
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు

తాలింపుకి :
మినపప్పు - 1 స్పూను
శనగపప్పు - 1 స్పూను
ఆవాలు - 1/2 స్పూను
జీలకర్ర - 1/2 స్పూను
ఇంగువ - చిటికెడు
ఎండు మిరపకాయలు - 2
పచ్చిమిరపకాయలు - 4(నిలువుగా చీల్చాలి)
నూనె - 2 స్పూను

తయారుచేసే విధానం:
1) ఒక మూకుడులో నూనె వేడి చేసి తాలింపు దినుసులన్నీ వేసి వేయించాలి.
2)బియ్యం కొంచం బిరుసుగా ఉడికించి పెట్టుకోవాలి.
3) ఉడికిన అన్నంలో ఉప్పు, పసుపు, తాలింపు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ వేసి బాగా కలిపి నిమ్మరసం పిండుకోవాలి.
For English recipe click here

 చవులూరించే పులిహోర మీకోసం సిద్దం